Minister KTR : పూనమ్ కౌర్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన కేటిఆర్..!

Minister KTR : రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య టాక్స్ లకు సంబంధిచిన వివాదం ఎపుడూ ఉండేదే. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా రాష్ట్రాల నుండి పన్నుల సేకరణ మరియు నిధుల విడుదల గురించి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతొందని చర్చ జరుగుతూనే ఉంది. సౌత్ రాష్ట్రాలలో జనాభా ఉత్తరాధి రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ, జనాభా నియంత్రనలో ముందున్నాం దీంతో జనాభా ప్రాతిపదికన నిధులను పంచినపుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తాయి. అయితే సౌత్ లో ఇండస్ట్రీలు, సాఫ్ట్ వేర్ హబ్ లుగా కొన్ని రాష్ట్రాలు ఉండటం వల్ల ఆదాయం ఎక్కువగా కేంద్రం చేతికి టాక్సుల రూపంలో వెళుతోంది. ఇక ఈ వైరుధ్యాల గురించి ఎప్పడూ చర్చిస్తూనే ఉన్నా ఈసారి నటి పూనమ్ కౌర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ మినిస్టర్ కేటిఆర్ మంచి సమాధానము చెప్పారు.

మా నుండి దేశానికి ఇంత లభిస్తున్నపుడు మమ్మల్ని గౌరవించండి…

నసినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు హ్యాండ్లూమ్ ల అభివృద్దికి పనిచేస్తూ ఉన్న నటి పూనమ్ కౌర్ తాజాగా ఒక వేడుకలో తెలంగాణ మినిస్టర్ కేటిఆర్ గారిని ‘టాక్సుల గురించి ఎపుడూ ట్వీట్ చేస్తుంటారు, రాష్ట్రనికి వచ్చే పన్నుల ఆదాయం ను ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కేంద్రంను నిందించడం హిపోక్రసీ లాగా అనిపించడం లేదా’ అని ప్రశ్నించింది. దీనికి కేటిఆర్ గారు సమాధానం చెబుతూ హస్తకళల అభివృద్ధికి మీరు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూనే గట్టిగా బదులిచ్చాడు.

కేటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జనాభా దేశంలో 2.5 % అయితే మేము దేశానికి అందిస్తున్న జీడీపీ 5% అంటూ చెప్పారు. తెలంగాణ పరిశ్రమల ద్వారా కేంద్రానికి అందిస్తున్న సంపద వల్ల గుజరాత్, మహారాష్ట్ర లేకపోతే మారేదైనా రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా తెలంగాణా ప్రజలకు ఆనందమే. కానీ ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన వారు హైదరాబాద్ లో బిర్యానీ తినండి, హైదరాబాద్ చూడండి. అలాగే దేశానికి మేము చేస్తున్న మేలు, అభివృద్ధిని గుర్తించండి గౌరవించండి అదే కోరుకునేది. ఎవరికీ మేము పని వాళ్లమో ఒకరి కింద పని చేస్తున్న వాళ్లమో కాదు. దేశానికి సేవ మేము చేస్తున్నాం, మేమేం చేయాలో మీరు చెప్పకండి. ఇలా చేయాలి అలా చేయాలి అంటూ డిక్టేట్ చేయాల్సిన పని లేదు అంటూ గట్టిగా బదులిచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago