Minister RK Roja : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అగ్ర హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో కొన్నేళ్లు టాప్ లో ఉన్న రోజా అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీదా అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచి ఫామ్ లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీ తో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు రోజా.
అలాంటి ప్రశ్నలు అడగొద్ధు… వాళ్ళు పాలిటిక్స్ కి పనికిరారు…
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజునాడు 2020 లో పుష్ప అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి చదువు బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. ఆ అమ్మాయి నేడు డాక్టర్ విద్య అభ్యసిస్తోంది. ఇక రోజా గారు 2021 లో నగరి నియోజకవర్గంలోని మీరా సాహెబ్ పాలెం అనే ఊరిని దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా మార్చడానికి కృషి చేస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడిన రోజా సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు అంటూ హాట్ కామెంట్స్ చేసారు. సినిమా వాళ్ళు ఒక పంజరంలో బ్రతుకుతుంటారని, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్లు నువ్వు తోపు అంటూ ఒక ఇమేజ్ లో పెట్టేస్తారు, అందులోనూ సినిమా వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు పాలిటిక్స్ లో ఓటమి వస్తే తట్టుకోలేరు అందుకే చిరంజీవి లాంటి వాళ్ళు పాలిటిక్స్ కి పనికిరారు అంటూ కామెంట్స్ చేసారు.
ఇక తాను ఇండస్ట్రీ నుండి వచ్చినా నా అన్నలు నన్ను ఆ ఇమేజ్ చట్రం నుండి బయటకు తెచ్చారు. నా సినిమాలను పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నా మా ఒక అన్న నన్ను విమర్శిస్తూనే ఉంటాడు. అందుకే నాకు ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా ఒకేలా ఉన్నాను అదే రాజకీయాల్లో ఉపయోగపడింది అంటూ చెప్పారు. ఇక వ్యక్తిగత ప్రశ్నలు అడిగినా పర్వాలేదు కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రశ్నలు అడగవద్దు అంటూ ఇంటర్వ్యూలో సీరియస్ అయ్యారు మంత్రి రోజా. కాంగ్రెస్ నుండి టీడీపీ అక్కడి నుండి వైసీపీ లో ఉన్న రోజా నెక్స్ట్ పార్టీ మారితే ఏ పార్టీ వెళ్తారు అనే ప్రశ్నకు వైసీపీ నుండి ఏ పార్టీ కి వెళ్ళను, ఒకవేళ అధినేత పార్టీ నుండి వెళ్ళమంటే వేరే పార్టీలోకి చేరను. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ కుండ బద్ధలు కొట్టారు రోజా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…