Shoban Babu: సోగ్గాడు అందాల నటుడు అంటే టక్కున అందరికీ శోభన్ బాబు గుర్తుకొస్తారు. తన అందంతో అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శోభన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శోభన్ బాబు తన వారసులని మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.
ప్రస్తుతం శోభన్ బాబు కుమారులు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.ఇకపోతే సినిమాలలో నటించిన శోభన్ బాబు సినిమాలలో నటిస్తూనే చాలా ముందు చూపుతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్నేహితుడు చంద్రమోహన్ శోభన్ బాబు ఆస్తులు గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ శోభన్ బాబు అందరిలాగా తన వారసులను ఇండస్ట్రీకి తీసుకురావడం కోసం తాపత్రయపడలేదు వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పారు. చెన్నైలో అన్నా నగర్ ఏరియాలో శోభన్ బాబుకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ తన ప్రాపర్టీస్ చూడడానికి ఒక పూట మొత్తం సరిపోతుందని చంద్రమోహన్ వెల్లడించారు.
శోభన్ బాబు అప్పట్లోనే ఒక ఎకరం 5000 రూపాయలతో కొనుగోలు చేశారు. ఇప్పుడు అక్కడ ఎకరం విలువ 50 కోట్ల వరకు ఉంది.ఇలా చెన్నైలో కొన్ని వందల ఎకరాల భూములను అప్పట్లోనే శోభన్ బాబు కొనుగోలు చేశారని అయితే ఇప్పుడు ఆ ఆస్తి విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చంద్రమోహన్ తెలిపారు. శోభన్ బాబు మరణించే సమయానికి ఆయనకు 80 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆస్తి మరింత పెరిగి ఉంటుందని చంద్రమోహన్ వెల్లడించారు. ఇలా ముందు చూపుతో అప్పట్లోనే భూమిని కొనుగోలు చేసిన శోభన్ బాబు అప్పటికి ఇప్పటికీ చాలా రిచెస్ట్ పర్సన్ అని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…