దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది. పిల్లల స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారు అనే విషయంపై అనేక సందేహాలు దేశ ప్రజలలో నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ ఫాఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. స్కూల్లు ఎప్పుడు తెరుస్తారు అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు.
అయితే దీనిపై ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ముగిసిన తరువాత కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష జరుగుతుందని, ఆ సమీక్షలో తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి విద్యాసంస్థలు ఎప్పుడు పునఃప్రారంభిస్తారు అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్లు రి-ఓపెన్ చేయడం కంటే, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం ముఖ్యమని మంత్రి అన్నారు. ఒకవేళ ఏప్రిల్ 14 తరువాత విద్యాసంస్థలు తెరవడం సాధ్యపడకపోయినా విద్యార్థులు నష్టపోయేది ఏమి ఉండదని చెప్పారు. పరీక్షల నిర్వహణ, పేపర్ల వాల్యుయేషన్ లు ఆ తరువాత అయినా చేసుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యపడదు కాబట్టే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సీబీఎస్ఈ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ కేంద్ర మానవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…