ఆమె వయసు 20 సంవత్సరాలు.. అతడి వయసు 17 సంవత్సరాలు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఈ విషయం ఇంట్లో తెలిసి వారిని వారించారు. పెద్దలు చెబుతున్న వినకుండా ఇద్దరూ కలిసి నగరంలోని ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు.నెల తిరిగేలోపు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాలుడు మృతి చెందగా యువతి ప్రాణాలతో బయటపడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన దాని ప్రకారం యూసుఫ్‌గూడలో నివసించే యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు వీరిని వారించి వారి ప్రేమకు అడ్డు చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి జవహర్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని అక్కడే సహజీవనం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం గదిలోనే వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.దీంతో శనివారం ఉదయం వీరిద్దరూ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సదరు యువతి చున్నీతో ఆత్మహత్యకు పాల్పడిన క్రమంలో చున్నీ ఊడిపోగా కింద పడి ప్రాణాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే యువతి చుట్టుపక్కల వాళ్ళను పిలిచి విషయం చెప్పి వారిని తీసుకువచ్చే సమయానికి సదరు యువకుడు మరణించాడు. అయితే బాలుడు తండ్రి పోలీసు శాఖలో పని చేస్తున్నారు ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…