General News

కారు ఆపి అంత పని చేసిన మహిళ… వీడియో వైరల్!

అన్ని జన్మలలోకి మానవ జన్మ ఎంతో గొప్పది.అయితే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఆ జీవితానికి సార్ధకత అనేది ఉండాలని చెబుతుంటారు. మానవ రూపంలో ఉన్న మనం ఇతర మనుషుల పట్ల, జంతువుల పట్ల సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకోవాలి. లేకపోతే మన ఎత్తిన ఈ జన్మకు సార్థకత ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియోలో మహిళ చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేరు. కారు ఆపి మరి మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

జెస్సికా ఫాయే ఉండా అనే మహిళ దీన్ని ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ కారులో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలోనే ఓ బాతు తన పిల్లలను తీసుకొని రోడ్డు దాటడానికి ఎంతో ఇబ్బంది పడుతోంది.ఇది గమనించిన మహిళ తన కారును పక్కన ఆపి రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలను కూడా ఆపింది.ఈ క్రమంలోనే బాతు తన పిల్లలతో ఎంతో సురక్షితంగా రోడ్డు దాటింది. ఈ సందర్భంగా ఈ వీడియోను షేర్ చేసిన మహిళ “నా పుట్టినరోజు సందర్భంగా నేను చేసిన మంచి పని” అని జెస్సికా పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CPGr5K_AV_u/?utm_source=ig_embed&ig_rid=76828578-cd2e-41cc-97eb-6042142992c7

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను చూసిన చత్తీస్‌గడ్‌కు చెందిన అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా కూడా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ మహిళ మాదిరిగానే ఎంతో విలువలతో జాలి, దయ, కరుణలతో మెలిగితే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చవచ్చని పేర్కొన్నారు. మరెందుకాలస్యం ఇంత అద్భుతమైన వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago