బాలీవుడ్ హీరో సుశాంత్ సంఘటన ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుశాంత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సుశాంత్ మరణం తర్వాత ఎన్నో సంచలనమైన ఆరోపణలు తెర మీదికి రావడంతో కొంతమంది బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదు కావడం లాంటి ఘటనలు కూడా ఈ కేసులో సరికొత్త చర్చకు దారితీశాయి.
సుశాంత్ ది బలవాన్మరణం కాదు ఎవరో కావాలని అతనిని అలా చేసారు అన్న ఆరోపణలు రావడంతో.. తమ కొడుకు మృతి కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీహార్ ముఖ్యమంత్రిని సుశాంత్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తు బీహార్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైన దగ్గర్నుంచీ రోజుకో కొత్త విషయం బయట పడుతుంది. తాజాగా సిబిఐ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఏ1 ముద్దాయిగా చేర్చి ఆమెపై FIR ను నమోదు చేశారు. రియా తల్లిదండ్రులు, సోదరుడితో పాటు శామ్యూల్ మిరిండా, శృతి మోడీలను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. అంతే కాకుండా సుశాంత్ మరణానికి ముందురోజే రియా చక్రవర్తికి భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా సిబిఐ దర్యాప్తులో తేలింది.
సుశాంత్‌కు చెందిన కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ల నుంచి ఈ నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతోనే రియా కుటుంబ సభ్యులు ముంబైలో 2 ప్రాపర్టీలు కొనుగోలు చేసారా.? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. తాజాగా సుశాంత్ డైరీ లభించడంతో ఈ కేసుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ డైరీ విషయంలో బయట పడిన ఆ నిజాలను బట్టీ సుశాంత్ బలవన్మరణానికి పాల్పడలేదు. అతడిని ఎవరో కావాలనే ఇలా చేశారన్న వాదనలకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. సుశాంత్ కు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉందని అతని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మాయమైనట్లుగా ప్రస్తుతం సీబీఐ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఆ డైరీలో బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలాకు సంబంధించిన పేజీలే ప్రత్యేకంగా మిస్సైన విషయాన్ని CBI అధికారులు తెలియ జేశారు. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం నుంచి సిబిఐ అధికారులకు ఈ కేసు దర్యాప్తులో ప్రత్యేక అనుమతులు ఉండగా.. సుశాంత్ మరణ సంఘటన ముంబైలో జరిగినందున మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి ప్రత్యేక అనుమతులు ఇస్తేనే ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…