కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే రెండేళ్లలో పర్యటించడం కోసం సెలవు ప్రయాణ భత్యం(ఎల్టీఎ) ఇవ్వడానికి సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్రం నుంచి త్వరలో అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడనుంది. కేంద్రం తీసుకున్నఈ నిర్ణయం గురించి ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జితేంద్ర సింగ్ ఉద్యోగులకు పెయిడ్ లీవ్ తో పాటు లీవ్ ట్రావెల్ కన్షెషన్ కూడా ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేసుకొని ప్రైవేట్ విమానాల్లో కూడా ఉద్యోగులు ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
2022 సంవత్సరం సెప్టెంబర్ 25 వరకు ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎల్టీఏను అందిస్తోంది. ఉద్యోగులు ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో వెళ్లి ఖర్చులను ఎల్టీఎ కింద పొందవచ్చు. మరోవైపు కేంద్రం ఈ సంవత్సరానికి మాత్రం ఉద్యోగుల భత్యాన్ని పెంచలేదు. రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుగుతున్న నేపథ్యంలో భత్యం పెంచే దిశగా కేంద్రం అడుగులు వేయలేదు.
కరోనా సంక్షోభం ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగా పడింది. కేంద్రం అన్ లాక్ అన్ లాక్ కు నిబంధనలను భారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. దేశంలోని పలు కీలక రంగాలపై నేటికీ ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చి పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రమే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…