గత కొన్ని నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల భారత్ లోని, తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారి గురించి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వాళ్లు వాసన కోల్పోతే ప్రమాదమని గతంలో కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అయితే ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఆధ్యయనాలు కరోనా రోగులు వాసన కోల్పోవడం మంచిదేనని చెబుతున్నాయి. ఎవరైతే కరోనా బారిన పడి వాసన కోల్పోతున్నారో వాళ్లు త్వరగా కోలుకుంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన పరిశోధనల్లో సైతం ఇదే విషయం వెల్లడైంది.
కరోనా సోకిన 207 మందిపై టెహ్రాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా రోగులు ఎవరైతే వాసన కోల్పోతారో వారిలో ముక్కుదిబ్బడ, తలనొప్పి, ప్లేట్ లెట్లు తగ్గడం లాంటి సమస్యలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా రోగుల్లో వాసన కోల్పోవడం హఠాత్తుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 1,60,000 కంటే తక్కువ సంఖ్యలో ప్లేట్ లెట్లు ఉన్నవాళ్లు వాసన కోల్పోతే త్వరగా కోలుకుంటారని వెల్లడిస్తున్నారు.
శరీరంలో వాసనకు సంబంధించిన ఏస్ 2 రిసెప్టార్స్ పై కరోనా వైరస్ దాడి చేస్తోందని ఫలితంగా కరోనా రోగులు వాసన కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాసన కోల్పోయిన కరోనా రోగులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లకు మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…