Featured

Mohan Babu : సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పేమీ కాదు… నా కొడుకు మాటిచ్చాడంటే చేస్తాడు : మోహన్ బాబు

Mohan Babu : మంచు మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు సినిమాల్లో పెద్దగా రానించలేదు. మనోజ్ డిఫరెంట్ జోనర్ సినిమాలను ప్రయత్నించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. విష్ణు ప్రెసిడెంట్ అయి ఏడాది గడిచిన సందర్బంగా మా అసోసియేషన్ గవర్నింగ్ బాడీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా డిన్నర్ ఏర్పాటు చేసి మీడియా మీటింగ్ ఏర్పాటు చేసారు. ఇక ఇందులో మాట్లాడిన మోహన్ బాబు గారు ఆసక్తికరంగా మాట్లాడారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలంటూ చెప్పారు.

హనుమంతుడు కొట్టుకున్నాడు… మనిషి ఒళ్లంతా విషమే…

మోహన్ బాబు ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఇటీవల మరణించిన కృష్ణం రాజుగారిని స్మరించుకున్నారు. కృష్ణం రాజు గారు విష్ణు కి మంచి సలహాలు ఇచ్చేవరంటూ గుర్తు చేసుకున్నారు. ఇక రమణ మహర్షి గారు చెప్పినట్లు అన్ని దుర్గుణాలు కలిసి మనిషి పుడతాడు, పాముకి కొరల్లో విషం ఉంటే తేలుకి తోకలో విషం ఉంటే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటూ మొహాసన్ బాబు చెప్పారు. సినిమాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఒటమిని జీర్ణించుకోలేని కొంతమంది ఏం చేసారో అందరికీ తెలుసు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మా అధ్యక్షుడు గా చేసాను కానీ ఇలా డిన్నర్ ఏర్పాట్లు ఇలాంటివి చేయలేదు. ఇక విష్ణు చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా చేస్తాడు అంటూ చెప్పారు.

ఒక మనిషికి సెల్ఫ్ డబ్బా అవసరం అంటూ మాట్లాడారు. అయితే చేయకుండానే చేస్తా అని చెబితే అది సెల్ఫ్ డబ్బా అవుతుంది చేసే దాని చెబితే అది తప్పు కాదు. ఈ కాలంలో మనం చేసిన మంచి పనులు చెప్పుకోవాలి, అందరికీ తెలియాలి. రామాయణం లో హనుమంతుడు లంకలో ఉన్న సీత వద్ద నూరు కోతుల్లో నేను ఒకడిని అని చెప్పాడు అదే హనుమంతుడు రావణుడు కూర్చోడానికి కుర్చీ వేయకపోతే మొత్తం లంకను తగలబెట్టి తానేంటో చూపించాడు. సందర్భాన్ని బట్టి మనమేంటో చూపించుకోవాలి అది తప్పు కాదు అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.

Bhargavi

Recent Posts

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

7 minutes ago

20 ఏళ్ల ‘పోకిరి’.. రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…

39 minutes ago

విష్ణు ప్రియతో పెళ్లి వార్తలపై జేడీ క్లారిటీ.. నిజం ఇదే!

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా…

52 minutes ago

కరెంట్ లేకుండా ఇల్లు కూలర్‌లా చల్లగా! ఈ పాత ట్రిక్ ట్రై చేయండి!

వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…

4 hours ago

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

5 hours ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

5 hours ago