Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలన్ గా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు మోహన్ బాబు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు ఎన్నో గొప్ప సినిమాలను తీసుకువచ్చారు.
ఇకపోతే తాజాగా మోహన్ బాబు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మార్చి 19 వ తేదీన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున మోహన్ బాబు యూనివర్సిటీలో పుట్టిన రోజు వేడుకలను జరిపారు. అంతేకాకుండా మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే ని కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా హాజరయ్యారు.
మోహన్ లాల్ తనది 50 సంవత్సరాల అనుబంధం అని తెలిపారు. 50 సంవత్సరాల నుంచి తామిద్దరం ఇండస్ట్రీలో కొనసాగుతున్నామని తెలిపారు. అయితే నేను సినిమాలలో బాగా నటించి సంపాదించినది మొత్తం సినిమాలకు నిర్మాతగా మారి నష్టపోయాను అలాంటి సమయంలోనే మోహన్ లాల్ నటించినటువంటి సినిమాని తెలుగులో రీమేక్ చేసి అల్లుడు గారు సినిమాతో హిట్ కొట్టానని తెలిపారు.
విలన్ గా అయిన నటిస్తాను..
అయితే కన్నప్ప సినిమాల్లో కూడా ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో తనకు నాకు మధ్య సన్నివేశాలు లేవు అందుకే తనతో నటించాలనే కోరిక ఉన్న నేపథ్యంలో నీ సినిమాలో నాకు ఒక అవకాశం కల్పించు విలన్ పాత్రలో అయినా సరే చేస్తాను కానీ విలన్ పాత్ర చేసేటప్పుడు నన్ను కావాలంటే తిట్టుగాని కొట్టేది మాత్రం చేయొద్దు తిట్టే సీన్లు అరిచే సీన్లు ఉంటేనే నేను చేస్తాను అంటూ తన స్నేహితుడు మోహన్ లాల్ ను రిక్వెస్ట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…