Latha Mangeshkar: గాన కోకిల లతా మంగేష్కర్ స్వరం నుంచి జాలువారిన..! మోస్ట్ రొమాంటిక్ 10 పాటలు ఇవే.. !
Latha Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈరోజు (ఫిబ్రవరి 6) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈమె గత నెల 8న కోవిడ్-19 పాజిటివ్ రాగా.. ఆమెను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం..ముంబాయ్ లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయినా ఆమెకు నీరసంగా అనిపించడంతో అక్కడే చికిత్స తీసుకున్నారు. తర్వాత వైద్యులు ఆమె ఆరోగ్యం బాగానే ఉందంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కొన్నాళ్లకు అస్వస్థకు గురి కాగా వెంటిలెటర్ పై చికిత్స అందిస్తుండగా.. ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు.
దీంతో ఆమె మరణంపట్ల ప్రతీ ఒక్కరు సంతాపం వ్యక్తం చేశారు. ఇక నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన లతా మంగేష్కర్ 36 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడారు . అంతే కాదు..25,000 పాటలలకు పైగా పాడి.. ఏ భాషలో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించున్నారు. ఇలా ఆమె గాన కోకిలగా పేరు పొందారు.
ఇక ఆమె జీవితంలో మరపురాని ఎన్నో మెలోడీ పాటలు ఉన్నాయి. అందులో మెలోడీ క్వీన్‌ని గుర్తు చేసుకుంటూ.. పాత కాలపు వ్యామోహాన్ని గుర్తుచేస్తూ.. ఆ అనుభూతిని కలిగించే 10 ఉత్తమ రొమాంటిక్ పాటల గురించి తెలుసుకుందాం.. అందులో మొదటగా..
లాగ్ జా గలే
1964 చలనచిత్రం వో కౌన్ తీలోని ఈ మధురమైన పాట లతా మంగేష్కర్ పాడిన టైమ్‌లెస్ రొమాంటిక్ క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది. దీనికి సాహిత్యం రాజా మెహదీ అలీ ఖాన్ అందించగా.. సంగీత దర్శకుడిగా మదన్ మోహన్ పని చేశారు.
బహోన్ మే చలే ఆవో
బహోన్ మే చలే ఆవో అనే పాట అనామిక (1973) చిత్రంలోనిది.. ఈ పాటను మజ్రూహ్ సుల్తాన్‌పురి రాశారు. రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం సమకూర్చారు.
పాకీజా నుండి చల్తే చల్తే
ఈ పాటతో లతా మంగేష్కర్ మరోసారి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నారు. గైడ్ సినిమాలోని పియా తోసే.. సాంగ్. 2022లో కూడా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇది బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిగ్ సాంగ్ లో ఒకటి. ఆరాధన నుండి కోరా కాగజ్ థా యే మన్ మేరా అనే సాంగ్ ఆల్ టైం హిట్ గా నిలిచింది.
దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నుండి తుజే దేఖా యో యే జానా సనాం సాంగ్. ఈ పాట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అన్ఫధ్ సినిమాలోని ఆప్ కి నజ్రోన్ నే సంఝా సాంగ్ ను లతా మంగేష్కర్ 1962లో విడుదలైన అన్పధ్ చిత్రం కోసం పాడారు.
ఏ మేరే వతన్ కే లోగోన్ అనే పాటను ఆలపించారు లతా మంగేష్కర్. ఈ పాట విని అప్పటి ప్రధాని నెహ్రూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. దిల్ సే నుండి జియా జలే సాంగ్.. సత్యం శివం సుందరం నుంచి అదే పేరుతో ఉన్న పాటను పాడారు. కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో టైటిల్ ట్రాక్ ను ఆలపించారు. ఇలా ఈ పాటలే కాకుండా.. ఇప్పటికే ఎప్పటికీ ప్రతీ ప్రేక్షకుడి మదిలో నిలిచే ఎన్నో పాటలను ఆలపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…