Featured

Lata Mangeshkar Facts: గతంలో విషప్రయోగం కారణంగా మంచానికే పరిమితమైన లతాజీ.. అతని సహాయం వల్లే ఇలా?

Latha Mangeshkar Facts: గాన కోకిల, భారత రత్న, పద్మ విభూషణ్ లతా మంగేష్కర్ మరణించడం యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. ముఖ్యంగా సినీ, సంగీత ప్రియులకు తీరని లోటు మిగుల్చుతూ.. దికికెగిశారు. దాదాపుగా ఎన్నో దశాబ్దాలుగా తన గాత్రంతో అందరిని అలరించింది. తెలుగులో కేవలం మూడే పాటలు పాడినా.. కూడా చెరగని ముద్ర వేశారు.

Lata Mangeshkar Facts: గతంలో విషప్రయోగం కారణంగా మంచానికే పరిమితమైన లతాజీ.. అతని సహాయం వల్లే ఇలా?

తన గొంతుతో ఎన్నో ఎమోషన్లను పలికించిన లతా మంగేష్కర్ మనల్ని వదిలివెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరుణంలో మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఈరోజు మరణించారు.

Lata Mangeshkar Facts: గతంలో విషప్రయోగం కారణంగా మంచానికే పరిమితమైన లతాజీ.. అతని సహాయం వల్లే ఇలా?

ఈ క్రమంలోనే ఆమె సాధించిన ఘనతలు, విశేషాల గురించి అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ సారి లతా మంగేష్కర్ పై విష ప్రయోగం జరిగిన విషయాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. 

దాదాపు మరణం అంచుకు వెళ్లిన …


1963లో లతా మంగేష్కర్ పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె ఓకానొక దశలో మరణిస్తుందని కూడా అంతా అనుకున్నారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. కాళ్లు కూడా కదపలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని లతాజీకి ఎంతో సన్నిహితంగా ఉండే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్ దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు.  ఈ విషప్రయోగం వల్ల దాదాపు మరణం అంచుకు వెళ్లిన లతా మంగేష్కర్ చివరకు కోలుకున్నారు. కోలుకున్నప్పటికీ.. విష ప్రయోగం వల్ల చాలా నీరసపడిపోయారు. చాలా రోజులు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ.. లతాజీకి ఎంతో సహాయపడ్డారు. తను రోజూ లతాజీ ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్‌ చెప్పి ఆమెను నవ్వించేవారు. ఆమె తినే ప్రతీ వంటనూ తనూ ముందుగా తిని చెక్ చేసే వారు. ఇలా కొన్నాళ్లు ఆమెకు సహాయపడిన సుల్తాన్ పురీ ఆమె కోలుకోవడానికి సాయపడినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago