Kaushal Manda: సీరియల్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమానికి వెళ్లారు.
ఈ కార్యక్రమం ద్వారా నిత్యం వివాదాలు గొడవలు పడుతూ చివరికి బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ ఈయన హౌస్ లో ఉన్నప్పుడు అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈయన కోసం ప్రత్యేకంగా ఆర్మీ కూడా ఏర్పడింది అంటే అతనికి ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా కౌశల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.తాను గెలిచిన తరువాత ఎలాంటి సినిమా అవకాశాల కోసం వెంట పడకుండా తన కోసం తనని గెలిపించిన వారి కోసం వెళ్లానని వారితో కలిసి గడిపానని తెలియజేశారు.అదే విధంగా తనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయని అయితే అప్పుడు తనకున్న క్రేజ్ చూసి ప్రొడ్యూసర్లకు ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల వారు అంత డబ్బు ఇవ్వ లేకపోవడంతో నాకు సినిమా అవకాశాలు రాలేదని తెలిపారు.
బిగ్ బాస్ హౌస్ లో ఒక టీవీ ఆర్టిస్టులను తీసుకోవడం అప్పటివరకు లేదని ఆ ప్రయోగం నాపై చేశారని నాపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడం వల్లే తరువాత సీజన్లలో టివి ఆర్టిస్టులను కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నా గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే తనకు నచ్చదని అది ఎక్కడో టచ్ అవుతుందని తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా కౌశల్ దీప్తి సునయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నా ఎక్స్పీరియన్స్ అంత వయసు కూడా లేని దీప్తి సునయన తన గురించి కామెంట్ చేయడం తనకు చాలా బాధగా ఉందని…కౌశల్ హౌస్ నుంచి రెండు వారాలకే బయటికి వెళ్తారు అంటూ కామెంట్ చేయడంతో చాలా బాధేసిందని అదే పట్టుదలతో బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నానని ఈ సందర్భంగా కౌశల్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…