Latha Mangeshkar Facts: గాన కోకిల, భారత రత్న, పద్మ విభూషణ్ లతా మంగేష్కర్ మరణించడం యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. ముఖ్యంగా సినీ, సంగీత ప్రియులకు తీరని లోటు మిగుల్చుతూ.. దికికెగిశారు. దాదాపుగా ఎన్నో దశాబ్దాలుగా తన గాత్రంతో అందరిని అలరించింది. తెలుగులో కేవలం మూడే పాటలు పాడినా.. కూడా చెరగని ముద్ర వేశారు.

తన గొంతుతో ఎన్నో ఎమోషన్లను పలికించిన లతా మంగేష్కర్ మనల్ని వదిలివెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరుణంలో మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఈరోజు మరణించారు.

ఈ క్రమంలోనే ఆమె సాధించిన ఘనతలు, విశేషాల గురించి అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ సారి లతా మంగేష్కర్ పై విష ప్రయోగం జరిగిన విషయాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు.
దాదాపు మరణం అంచుకు వెళ్లిన …
1963లో లతా మంగేష్కర్ పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె ఓకానొక దశలో మరణిస్తుందని కూడా అంతా అనుకున్నారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. కాళ్లు కూడా కదపలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని లతాజీకి ఎంతో సన్నిహితంగా ఉండే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్ దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. ఈ విషప్రయోగం వల్ల దాదాపు మరణం అంచుకు వెళ్లిన లతా మంగేష్కర్ చివరకు కోలుకున్నారు. కోలుకున్నప్పటికీ.. విష ప్రయోగం వల్ల చాలా నీరసపడిపోయారు. చాలా రోజులు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ.. లతాజీకి ఎంతో సహాయపడ్డారు. తను రోజూ లతాజీ ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పి ఆమెను నవ్వించేవారు. ఆమె తినే ప్రతీ వంటనూ తనూ ముందుగా తిని చెక్ చేసే వారు. ఇలా కొన్నాళ్లు ఆమెకు సహాయపడిన సుల్తాన్ పురీ ఆమె కోలుకోవడానికి సాయపడినట్లు తెలుస్తోంది.






























