తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ క్యూట్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం ఆయన నటన కాదు… ఆయన మనవడు చేసిన అల్లరి.

మంచు విష్ణు కుమారుడు, మోహన్‌బాబు మనవడు అవ్రామ్ తన తాతయ్యను ఆటపట్టించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా మోహన్‌బాబు ముందు అందరూ ఎంతో గౌరవంగా, నిశ్శబ్దంగా ఉండటం చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
అవ్రామ్ అల్లరి చేస్తుండగా మోహన్‌బాబు అతన్ని నెమ్మదిగా శాంతింపజేయాలని ప్రయత్నించారు. కానీ చిన్నారి ఏమాత్రం తగ్గకుండా తాతయ్యను అనుకరిస్తూ ‘ఏంటి బాబూ…’ అంటూ సరదాగా రియాక్ట్ అవ్వడం నవ్వులు పూయించింది. చిన్నారి అమాయకత్వం, స్టైల్ నెటిజన్లను కట్టిపడేస్తోంది.
చివరికి తన అల్లరి కొనసాగిస్తూ, ఎంతో క్యూట్‌గా ‘బై బాబూ’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. మనవడి ఈ తీరుకు మోహన్‌బాబు కూడా చిరునవ్వులు చిందించడం మరింత ఆకర్షణీయంగా మారింది.
ఈ వీడియో చూసిన అభిమానులు “తాతకు తగ్గ మనవడు”, “డైలాగ్ కింగ్ ముందు డైలాగ్ కొడుతున్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కఠిన స్వభావం ఉన్నవారినైనా చిన్నారుల అమాయకత్వం ఎలా కరిగిస్తుందో ఈ వీడియో మరోసారి చూపించింది.
































