Political News

ఏకంగా ఎంపీ మెడలో చైన్ లాకెళ్లిన దొంగలు! ఎంపీ గాయాలు !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చాణక్యపూరి ప్రాంతంలో, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ దొంగల బారిన పడ్డారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

సోమవారం ఉదయం సుధా రామకృష్ణన్ తన సహచర ఎంపీతో కలిసి చాణక్యపూరిలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో నడుస్తున్నారు. ఈ సమయంలో హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఒక పార్లమెంట్ సభ్యురాలిపైనే ఇటువంటి దాడి జరగడంపై ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దౌత్య కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు ఉండే చాణక్యపూరి వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం ఢిల్లీ భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా సుధా రామకృష్ణన్ లేఖ రాసినట్లు తెలిసింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago