మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటివరకు చాలా మంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నప్పటికీ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించలేదు. సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ కాస్ట్ అండ్ క్రూ ఎంపిక చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్ 2’తో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న సంజయ్ దత్‌ను ssmb28తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయం గురించి చిత్ర బృందం సంజయ్ దత్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే సంజయ్ దత్ మహేష్ తో తలపడటానికి సిద్ధమవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే మహేష్ సర్కార్ వారి పాట తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాకి పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…