Political News

Murali Mohan : చంద్రబాబు చేసిన పెద్ద తప్పు అదే.. దాని వల్లే రాష్ట్రం విడిపోయింది. : మురళి మోహన్

Murali Mohan : రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయ్యరాని బంధం ఉంది. రామారావుగారు రాజకీయాల్లోకి వచ్చినపుడు మొఖానికి రంగేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని విమర్శలొచ్చాయి. కానీ రామారావు గారు సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్ళు చాలా మంది రాజకీయాలవైపు అడుగులేసారు. అటు తమిళ నాడు రాజకీయాల్లోనూ సినిమా వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక చాలా మాది సినిమా ప్రముఖులు ఎంపీలు, ఎమ్మెల్యే లుగా రాజకీయాల్లో రాణించారు. అలాంటి వారిలో మాగంటి మురళి మోహన్ గారు ఒకరు. సినిమాల నుండి రాజకీయాలవైపు వచ్చిన ఆయన టీడీపీ పార్టీ తరుపున ఎన్నికై ఎంపీ గా సేవాలందించారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఒకప్పుడు టీడీపీ తీసుకున్న చారిత్రాత్మక తప్పిదాల గురించి మాట్లాడారు.

ఆరోజు చంద్రబాబు అలా చేయడం తప్పే…

అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారికి కెసిఆర్ శిష్యుడు. ఒకప్పుడు టీడీపీ లో ఉన్న కెసిఆర్, చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో వేరు కుంపటి పెట్టి చివరకు తెరాస పార్టీ స్థాపించి ఆ తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇక ఈ విషయం లో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేసారని మురళి మోహన్ గారు ఒప్పుకున్నారు. కెసిఆర్ తో పాటు ఆనాడు విజయ రామారావు గారు ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, అయితే విజయ రామారావు గారు మాజీ సిబిఐ ఆఫీసర్ అవడంతో చదువుకున్న వ్యక్తి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రాజకీయాల్లో ఉండాలని ఆయనను రాజకీయాల్లోకి చంద్రబాబు గారే ఆహ్వానించడం ఆయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది.

ఇక చదువుకున్న ఒక నిజాయితీ వ్యక్తి మంత్రి అయితే బాగుంటుందని కెసిఆర్ ను కాదని విజయ రామారావు కి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో కెసిఆర్ గారు వేరు కుంపటి పెట్టారు అని వివరించారు. దాని వల్లే ఈనాడు రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయ్యాక కష్టపడ్డారు కానీ ఉద్యోగులతో నిరంతరం సమీక్ష లు నిర్వహించడం వారిని అభిప్రాయాలను అడగకుండా ఈయనే చెప్పడం వంటివి ఆయనకు వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఆయన పొరపాట్లే కానీ, తప్పులు కాదు ఆయన స్వలాభం కోసం చేయలేదు రాష్ట్రాన్ని దోచుకోలేదు కదా అని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

2 minutes ago

పరగడుపున పండ్లు తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం!

ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…

32 minutes ago

ఆధ్యాత్మిక యాత్రకు బెస్ట్ డెస్టినేషన్.. కొండల మధ్య భక్తి క్షేత్రాలు.. తప్పక చూడాల్సిన దేవాలయాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…

1 hour ago

తాతను ఆటపట్టించిన మనవడు.. మోహన్‌బాబు క్యూట్ రియాక్షన్ వైరల్

తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…

1 hour ago

కరుప్పు లో త్రిష ఎంపికపై.. డైరెక్టర్ ఓపెన్ స్టేట్‌మెంట్!

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…

1 hour ago

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…

2 hours ago