Featured

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

Tollywood Heroes Daughters: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసత్వాలు కొనసాగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఒక హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే అనంతరం వారి పిల్లలు కూడా అదే వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల కొడుకులు కూతుర్లు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అలాగే మరికొందరు హీరోలు మాత్రం తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. మరి ఆ హీరోలు ఎవరు వారి కూతుర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే..

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇప్పటికే రోషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీకాంత్ కూతురు మేధా తిరుపతిలో సందడి చేయగా శ్రీకాంత్ కూతురు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈమె డిగ్రీ చదువుతోంది తనకు సినిమాలలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని అందుకే చదువుపై దృష్టి పెట్టి పై చదువులు చదువుతుందని తెలుస్తుంది.

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

మాస్ మహారాజ రవితేజ కుమారుడు ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్ర ద్వారా మెప్పించారు. ఇకపోతే రవితేజ కూతురు మోక్ష భూపతి రాజు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె ఫారెన్ లో డిగ్రీ చదువుతున్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఇండస్ట్రీలోకి రాలేదు. ఇప్పటికే పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం చేసుకొని ఫారెన్ లో సెటిల్ కాగా రెండవ కుమార్తె హయ వాహిని సైతం పై చదువులు నిమిత్తం ఫారిన్లో ఉన్నారు. ఇక మూడవ కుమార్తె భావన కూడా ఉన్నత చదువులపై దృష్టి సారించారు.

ఉన్నత చదువులు చదువుతున్న స్టార్ హీరోల వారసురాళ్ళు..

హీరోగా విలన్ గా అందరిని మెప్పించిన నటుడు జగపతిబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు పెళ్లి చేసే అమెరికా పంపించగా రెండవ కుమార్తె కూడా ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. వీటిలో పెద్ద కుమార్తె సాయి ప్రసీద ఇప్పటికే తన చదువులు పూర్తిచేసే బిజినెస్ వైపు అడుగులు వేశారు. ఇక ఈమె తన అన్నయ్య ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. మిగిలిన ఇద్దరు కూడా పై వారి చదువులను కొనసాగిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago