Featured

Murali Mohan : చిరంజీవి పై విష ప్రయోగం నిజమే.. సంచలన వాఖ్యలు చేసిన మురళి మోహన్..!

Murali Mohan : సినిమా ఇండస్ట్రీ లో ఒకరి ఎదుగుదలను ఓర్చుకోని వాళ్ళు ఉంటారు. ఒకరు ఎదగకూడదని, సినిమా అవకాశలు రాకుండా తొక్కేయాలని అనుకుంటూ కుయుక్తులు చేస్తుంటారు. కానీ చిరంజీవి మెగాస్టార్ అవ్వడం నచ్చని కొంత మంది మాత్రం చంపాలని ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చేవి. ఇవి నిజమా అపద్దమో తెలియదు. అయితే తాజాగా సీనియర్ నటుడు మురళి మోహన్ ఈ విషయంపై స్పందించారు.

చిరు పై ఆ సినిమా టైములో విష ప్రయోగం…

చిరంజీవి కష్టపడి సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చాడు. అలా మెగాస్టార్ గా ఎదిగిన చిరు ఎదుగుదలను ఓర్వలేని కొంత మంది ఆయన మరణానికి ప్లాన్ చేసారు. అప్పట్లో అవుట్ డోర్ షూటింగులకు వెళితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేది. అలా మరణమృదంగం సినిమా షూటింగ్ సమయంలో చెన్నై లో షూటింగ్ జరుగుతున్నపుడు చాలా ఎక్కువ మంది అభిమానులు రావడం, ఆటో గ్రాఫ్ లు ఫోటోలు అంటూ ఎగబడడం జరిగింది. ఇక ఓ అభిమాని కాళ్లపై పడి నా పుట్టినరోజు మీ సమక్షంలో జరుపుకుంటానని కోరగా చిరు సరే అని చెప్పక తప్పలేదు. ఇక కేక్ కటింగ్ తరువాత వద్దని ఎంత చెప్పినా నోట్లోకి కేక్ పెట్టాడు ఆ అభిమాని. రుచి తేడాగా ఉండడంతో వెంటనే దాన్ని ఉమ్మేసి నోరు కడుకున్నాడు చిరు.

అభిమానుల తాకిడి వల్ల తోపులాట జరిగి కేక్ కింద పడిపోయింది అందులో రంగుల రంగుల పద్దర్థాలు కనిపించడం జరిగింది. అయితే మేకప్ వేయడానికి వచ్చిన సిబ్బంది ఆయన పెదాలు నీలంగా మారడం గమనించి విష ప్రయోగం జరిగిందనే అనుమానం వచ్చి హాస్పిటల్ కి తరలించగా వాంతులవడానికి టాబ్లెట్ ఇచ్చి విషాన్ని తొలగించారు. ఇక రెండు రోజుల రెస్ట్ తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు చిరు. ఇక ఈవిషయం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇక ఈ ఇష్యూ గురించి మురళి మోహన్ ఆసక్తికర వాఖ్యలు చేసారు. చిరు మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించిన రోజుల్లో గిట్టని వారు ఆయన మీద విష ప్రయోగం చేసి ఉండొచ్చు అంటూ చెప్పారు. ఇక అంతటి సీనియర్ నటుడు చెప్పాడు అంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అనే అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

3 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

5 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

5 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

6 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

6 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

6 hours ago