Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచేయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు.
రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు… జగన్ అలా చేస్తే…
మురళీ మోహన్ గారు అటు సినిమాల్లో హీరోగా ఎన్నో సినిమాలను చేసినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలను చేసారు. ఇక ఆయన శోభన్ బాబు గారి సలహాతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎంపీ గా కూడా ప్రజాసేవ చేసిన మురళీ మోహన్ గారు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఇపుడు ఎందుకు రాజకీయాల్లో లేరు అనే విషయాన్ని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని మొదటి నుండి ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినపుడు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినా మురళీ మోహన్ గారు సున్నితంగా తిరస్కరించారట.
పార్టీ కి కావలసిన ఏదైనా సహాయం చేస్తాను కానీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పేసారట. అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు అందుకున్నాక మరోసారి మురళీ మోహన్ గారిని అడిగినా మళ్ళీ తిరస్కరించారట. అయితే ఈసారి చంద్ర బాబు పట్టుబట్టడం, కొడాలి శివ ప్రసాద్ గారిని ఇంటికి పంపి అడిగించడంతో కాదనలేక రాజకీయాల్లోకి వచ్చారట. కానీ రాజకీయాల్లో ఎంత చేసినా మన మీద బురద జల్లుతారు కానీ మనం చేసామని అభినందించరు. అన్నేళ్లు సంపాదించుకున్న పేరు రాజకీయాల్లో పోగొట్టుకుంటాం, చేయాలనుకున్న సేవ రాజకీయాలతో పని లేకుండా చేయొచ్చు అందుకే వాటికి దూరంగా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక జగన్ పరిపాలన గురించి మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి అన్నాడు, జగన్ సంక్షేమం అంటున్నాడు. అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్ళలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం జగన్ తెలుసుకుంటే ఆయనకు తిరుగుండదు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…