Featured

Murali Mohan : రాజనాల చివరి రోజుల్లో ఎలా మరణించడంటే… రాజశేఖర్ ఆవేశపరుడు…: మురళీ మోహన్

Murali Mohan : వ్యాపారం నుండి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన మురళీ మోహన్ గారు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల్లో నటించారు. జగమే మాయ సినితో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు, స్టార్ డమ్ తెచ్చుకున్నారు. మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు పాలిటిక్స్ లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీ గా ఎన్నో సేవా కార్యకర్మలను చేసారు. ఇక మరో వైపు వ్యాపారవేత్తగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కాకుండ ఏంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు మురళీ మోహన్. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జీవిత విశేషాలను తెలిపారు.

రాజనాల ఎలా చనిపోయారంటే…

మా అసోసియేషన్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలను చెబుతూ మురళీ మోహన్ గారు ఏ తెలుగు ఆర్టిస్టు ఆర్థికంగా ఇబ్బందులను పడకూడదు అలానే ఎవరూ లేని వాడిగా చనిపోకూడదు అనే ఉదేశంతో ఆర్టిస్టులకూ అండగా ఉండాలని మా అసోసియేషన్ పెట్టామని చెప్పారు. ఇక పెట్టిన కొన్నిరోజులకే పిఎల్ నారాయణ అనే ఒక ఆర్టిస్ట్ అలానే స్క్రిప్ట్ రైటర్ ఆర్థిక ఇబ్బందులతో సినిమాల్లోను పెద్దగా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ అలానే మరణించారు. ఆయన రాజమండ్రి లో ఉండగా మళ్ళీ హైదరాబాద్ కు కారులో వస్తూ కారు లోనే మరణించారు. ఇక విషయం తెలిసీ ఆయనకు అంత్యక్రియలు ఘనంగా జరిపి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసాం మా అసోసియేషన్ ద్వారా అంటూ తెలిపారు. ఇక ఆ తరువాత ఒక హాస్పిటల్ నుండి ఫోన్ రాగా రాజనాల గారు అక్కడ చికిత్స పొందుతున్నారని తెలిసీ వెళ్లగా ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడని షుగర్ ఎక్కువైంది కాలు తీసేయాలి లేకపోతే బ్రతకడనికి చెప్పడంతో ఆయనకు చికిత్స కోసం అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళితే ఆయన ప్రభుత్వం తరుపున మొత్తం ఖర్చు చూసుకున్నారు. ఆ తరువాత ఆయన పోషణకు మా అసోసియేషన్ డబ్బు పోగేసి ఇచ్చాం. అవి అయిపోయాక అయన మళ్ళీ అడగడంతో కొంతమంది ఇచ్చిన అవి ఆయనకు సరిపోలేదు చెన్నై కి వెళ్లారు.

అక్కడ జయలలిత సీఎంగా ఉందని అక్కడ సహాయం దొరుకుతుందని వెళ్లగా సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. ఇక పరిస్థితి విషమించి ఆయన అక్కడే మరణించడం వల్ల ఆయనను హైదరాబాద్ తీసుకురావడానికి మళ్ళీ ప్రభుత్వం సహాయంతో హెలీకాప్టర్ ద్వారా ఆయనను తీసుకువచ్చి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాం అంటూ తెలిపారు. ఇక మా అసోసియేషన్ లో ఏవైనా గొడవలు ఉంటే వాటిని మనలో మనమే పరిష్కరించుకోవాలి కానీ వాటిని బయట పెట్టుకోకూడదనే తీర్మానం చేసుకున్నాక డైరీ ఆవిష్కరణ వేడుక చేసాం. ఆ సమయంలో చిరంజీవి మంచి మైకు ముందు చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అంటూ చక్కగా చెప్పాడు. అయితే అదే సమయంలో హీరో రాజశేఖర్ ఆవేశంగా పరుచూరి దగ్గర మైక్ లాక్కొని మాట్లాడాడు. అతను చెడ్డ వ్యక్తి కాదు కానీ ఆవేశపరుడు అంటూ తెలిపారు. ఆ సంఘటన తరువత ఐదు మంది సభ్యులతో ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసాము అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

ఈ చిన్న అలవాట్లు మీ పళ్ళను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయా?

మన రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. పళ్ళపై ఉండే తెల్లటి రక్షణ…

17 seconds ago

వంటింట్లోనే హెల్త్ సీక్రెట్… మెంతులు ఎందుకు తినాలి?

మన వంటింట్లో సాధారణంగా కనిపించే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతున్నాయి. పరిమాణంలో చిన్నగా…

6 minutes ago

రాత్రి నిద్రలో ఈ అలవాటు ఉంటే జాగ్రత్త… దంతక్షయం పెరుగుతుంది!

నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…

14 minutes ago

దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే… గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద చెప్పిన అసలు సత్యం!

దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…

23 minutes ago

వేదమంత్రాల నడుమ అద్భుత వేడుక… పాల్ఘర్‌లో మందిర ప్రతిష్ఠ!

మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్‌ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…

53 minutes ago

హాలిడే హార్ట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? వేసవిలో పెరుగుతున్న ముప్పు!

వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై…

1 hour ago