Featured

Kirrak RP : నెల్లూరు చేపల పులుసు ఎలా వండాలో ట్రైనింగ్ ఇస్తున్న కిర్రాక్ ఆర్పీ…!

Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి, మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. మీడియా పబ్లిసిటీతో కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

నెల్లూరు చేపల పులుసుకు ట్రైనింగ్…

జనాల డిమాండ్ కు సరిపడా వండించలేక పోయిన ఆర్పీ కర్రీ పాయింట్ ను తాత్కాలికంగా ముయించాడు. భారీగా జనం క్యూ కట్టడం వల్ల వాళ్లందరికీ సరిపడా వండించలేకపోతున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరు మహిళలకు ఆఫర్ ఇచ్చాడు. నెల్లూరు చేపల పులుసు ఎవరైతే బాగా వండుతారో వాళ్ళు చేసి తీసుకువస్తే ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తామంటూ చెప్పడంతో చాలా మంది మహిళలు కిర్రాక్ ఆర్పీకి తమ చేపల పులుసు ను రుచి చూపించడానికి వచ్చారు. ఇక వారిలో ఎవరు బాగా చేసారో రుచి చూసి డిసైడ్ చేస్తున్నాడు ఆర్పీ.

నెల్లూరు చేపల పులుసు కట్టెల పోయి మీద సరిగ్గా నెల్లూరు వాళ్ళు వండినట్లే వండి వడ్డిస్తానంటూ ఆర్పీ మాటిచ్చాడు. హైదరాబాద్ జనాలకు నెల్లూరు చేపల పులుసు రుచి చూపుతానంటూ చెబుతున్నాడు. ఇక ఆర్పీ వద్దకు చేపల పులుసు చేసి తీసుకోచ్చిన మహిళలు చేపల పులుసును పూర్వం ఉండే విదంగా ఇప్పుడు చేస్తే అందరికి నచ్చుతుందని, కొత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అంటూ వేయాల్సిన పని లేదని కారం, ఉప్పు, చింతపండు పులుసు సరిగ్గా పడితే పులుసు బాగుంటుందని, చేసిన రోజు కంటే మరుసటి రోజుకు పులుసు మరింత రుచి వస్తుందని అందుకు కారణం అందులో వేసే అవపిండి మెంతి పిండి అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago