Big boss Koushal : బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చి విన్నర్ అయి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, మోడల్ కౌశల్ మండా. కౌశల్ ఆర్మీ ఆ బిగ్ బాస్ సీజన్ లో బాగా హైలైట్ అయింది. అంత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న కౌశల్ బిగ్ బాస్ తరువాత వరుస అవకాశాలతో బాగా బిజీ అవుతారు అని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఆయన వెండి తెర మీద కానీ బుల్లి తెర మీద కానీ పెద్దగా కనిపించలేదు. ఇక కౌశల్ మొదట సినిమాల్లో అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసాడు.
కోపం వస్తే అంతే… నా భార్య బాగా ఫుడ్డీ…
కౌశల్ ఇటీవల తన భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పెళ్లి గురించి మాట్లాడారు. తను చాలా వర్క్ హాలిక్ అని అసలు కుటుంబం కోసం టైం అసలు కేటాయించరంటూ నీలిమా తన భర్త గురించి తెలిపారు. ఇక కౌశల్ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా పిల్లలతో మాత్రం ఎంజాయ్ చేస్తారంటూ చెప్పారు. అయితే కోపం వస్తే చాలా కష్టమంటూ చెప్పారు. ఇప్పటికి ఇంట్లో మూడు లక్షల విలువైన రెండు టీవీలను పగులగొట్టారంటూ చెప్పారు.
ఇక తన భార్య గురించి కౌశల్ మాట్లాడుతూ తనకు పెళ్లి సమయంలో పిజ్జా, బర్గర్ అంటే కూడా తెలియదని ప్రపంచం అసలు ఏమి తెలియదని మొదటి సారి ఎక్కడికైనా వెళదాం అని అడిగితే షిరిడి వెళ్లాలని అడిగిందంటూ చెప్పారు. ఇక తాను ఫుడ్ డైట్ అంటూ ఉంటా కానీ నా భార్య చాలా ఫుడ్డీ అంటూ తెలిపారు. నెలకు 30 వేల దాకా స్విగ్గి బిల్ కడుతున్నానంటూ సరదాగా తన భార్య గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…