Shruthi Hassan: దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. అదేవిధంగా బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించారు.ఈ రెండు సినిమాల్లో కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అలాగే ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్నాయి.
ఇలా ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమాల విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె చిరంజీవి బాలకృష్ణ డాన్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలలో కూడా శృతిహాసన్ హీరోయిన్ కావడంతో ఎక్కువగా ఇద్దరు హీరోల మధ్య వ్యత్యాసం గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే డాన్స్ విషయంలో ఏ హీరో అద్భుతంగా డాన్స్ చేస్తారని ప్రశ్న ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు శృతిహాసన్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఇంతకీ ఈమె చెప్పిన సమాధానం ఏంటి అనే విషయానికి వస్తే…
డాన్స్ విషయంలో బాలకృష్ణ మాస్ పర్ఫామెన్స్ చేయడంలో తోపు అంటూ సమాధానం చెప్పగా… క్లాస్ మాస్ కలిపి కొట్టడంలో చిరు కేక అంటూ సమాధానం చెప్పారు. ఇలా ఇద్దరి హీరోలను సమానంగా భావిస్తూ వారి డాన్స్ విషయంలో ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…