Srija Konidela: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈమె గత రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఎన్నో పరిణామాలకు దారి తీసింది. ఈమె 2022ను తలుచుకుంటూ ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసే అదృష్టాన్ని కల్పించావు…కష్టసుఖాల్లో తన తోడుండి తనని ప్రోత్సహించిన వ్యక్తితో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న అంటూ పోస్ట్ చేశారు.
ఈ విధంగా శ్రీజ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా అంటూ పోస్ట్ చేయడంతో ఈమె తప్పనిసరిగా తన మూడవ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇప్పటికే ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు.
ఇక రెండవ భర్తతో కూడా విడాకులు తీసుకోవడంతో ఈమె మూడో పెళ్లికి సిద్ధమైందని అందుకే ఇలాంటి పోస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన శ్రీజ తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని కూడా వెల్లడిస్తూ పోస్ట్ చేశారు.
తాను ఎవరితోనో రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ వచ్చే వార్తలలో నిజం లేదని ఈమె తెలియజేస్తూ ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ తన ఫోటోతో శ్రీజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె సెల్ఫ్ రిలేషన్ లో ఉన్నారంటూ తెలియజేయడంతో ఈమె మూడో పెళ్లి చేసుకోలేదని తన గురించి తానే అలా చెప్పుకొచ్చారంటూ నేటిజన్స్ భావిస్తున్నారు. మొత్తానికి శ్రీజ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…