Murali Mohan : బాపు రమణల ఊహాత్మక,సృజనాత్మకతకు ప్రతి రూపమే ఆ చిత్రం.మొదటగా ఈ చిత్రాన్ని కన్నడంలో రూపొందించారు ఆ తర్వాత తెలుగులో నిర్మించి తదుపరి హిందీలో హమ్ పాంచ్ గా పునర్నిర్మించారు. మురళీమోహన్ చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్, విజయభాస్కర్ పంచ పాండవుల లాగా కనిపిస్తే కృష్ణంరాజు మహాభారతంలోని శ్రీ కృష్ణుడిని పొలీ ఉంటాడు. 1978 నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని కొంత విప్లవాత్మకంగా ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్ర కథను తీర్చిదిద్దారు. మన ఊరి పాండవుల చిత్ర నిర్మాత జయకృష్ణ ఒకసారి “ప్రాణం ఖరీదు” చిత్ర నిర్మాత గంగాధర్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ నటీనటుల ఆల్బమ్ చూస్తుండగా.. చిరంజీవి ఫోటో చూశారు.
ఆయన ముఖంలో తేజస్సు,ఎర్రటి కళ్ళు జయకృష్ణని బాగా ఆకర్షించాయి. ఆ ఫోటో తీసుకువెళ్లి దర్శకుడు బాపుకు చూపించారు. మన చిత్రంలోని అర్జునుడిని పోలిన పాత్రకు బాగా సరిపోతారని చిరంజీవిని తీసుకుందామనుకున్నారు. అలా మన ఊరి పాండవులు చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఉండరని పంచపాండవు లాంటి ఐదుగురు సినిమా మొత్తాన్ని నడిపిస్తారని.. అందులో మీది(చిరంజీవిది) ఒక పాత్ర అని చెప్పడంతో చిరంజీవి ఏమాత్రం ఆలోచించకుండా.. ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు. మన ఊరి పాండవులు చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం గ్రామీణ వాతావరణంలో జరిగింది.మన ఊరి పాండవులు మెగాస్టార్ చిరంజీవికి నటన పరంగా ఇది మూడో సినిమా, విడుదలపరంగా రెండవ సినిమా… ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతుండగా.. ఏం జరిగిందో మురళీమోహన్ మాటల్లోనే..
ఒకసారి నేను విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో.. అక్కడున్నవారు ఆటోగ్రాఫ్ కావాలంటూ నా దగ్గరకు వచ్చి చుట్టుముట్టారు. వారందరికీ నేను ఆటోగ్రాఫ్ ఇవ్వడాన్ని పక్కనున్న చిరంజీవి గమనించారు. వారంతా వెళ్ళిపోయాక చిరంజీవి నా దగ్గరకు వచ్చి భవిష్యత్తులో నేను హీరోగా ఎదిగితే ఆటోగ్రాఫ్ కావాలంటూ అభిమానులు నా దగ్గరికి కూడా ఇలానే వస్తారా? అన్నయ్య అంటూ అడిగే వాడని.. అలాగే నువ్వు కూడా హీరోగా ఎదిగాక ఆటోగ్రాఫ్ కావాలంటూ అభిమానులు వెంట పడతారని చెప్పడంతో చిరంజీవి సంతోషపడ్డారు. అలాంటిది ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారని మురళీమోహన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చమత్కరించడం జరిగింది. బుల్లితెరను చూస్తున్న ప్రేక్షకులు ఆ మాటలు విని హర్షాన్ని వ్యక్తం చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…