Muthyala Subbaiah: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. మామగారు, కలికాలం, ఎర్రమందారం, హిట్లర్, పవిత్ర బంధం గోకులంలో సీతవంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఘనత ముత్యాల సుబ్బయ్య ఉందని చెప్పాలి. అయితే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సమయంలో ఈయన హవా పూర్తిగా తగ్గిపోయింది.
ఈ క్రమంలోనే ఈయన సినిమా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్యాల సుబ్బయ్య సినీ కెరియర్లు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి తెలియజేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయనకు నాటకాలలో మంచి అనుభవం ఉండడంతో సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ నెలకు 150 రూపాయలు జీతం అందుకునేవారు.ఇలా 150 రూపాయలు జీతం రావడంతో ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని పోషించడం భారమవుతుందని పెళ్లి విషయాన్ని మర్చిపోయాను.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తనకు ఏకంగా ముగ్గురు నిర్మాతలు సినిమా అవకాశాలు కల్పించారు.
ఇలా తనకు మూడు సినిమా అవకాశాలు రావడంతో తన కెరీర్ కు ఒక భరోసా వచ్చిందని అందుకే తాను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముగ్గురు నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు. ఇలా అనుకున్న సినిమాలు చేజారిపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఏడు సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఈ సందర్భంగా తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశారు. ఇలా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు టి. కృష్ణ దగ్గర దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఇక ఆయన దగ్గర ఆరు సినిమా అవకాశాలు రావడంతో అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకో లేదని ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య తన సినీ కెరియర్ గురించి తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…