Singer Sunitha:సింగర్ సునీత టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత ప్రస్తుతం రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది నటీమణులకు డబ్బింగ్ చెప్పిన ఈమె హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీత తన వ్యక్తిగత జీవితం గురించి కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నుంచి సునీతకు ఒక ప్రశ్న ఎదురయింది. టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు ఉంది మీరు ట్రెండ్ సెట్టరా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నపై సునీత స్పందిస్తూ నాకు కూడా అదే అర్థం కాలేదు వాళ్ళు ఏం చూసి నన్ను అభిమానిస్తున్నారో అర్థం కాలేదు అంటూ సమాధానం చెప్పడంతో మీరు హీరోయిన్ పాపులారిటీ ఉందని ఒప్పుకున్నట్టే కదా అంటూ యాంకర్ అన్నారు.అయితే ఇలాంటి కొన్ని అంశాలు తరచూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాయని ఈ సందర్భంగా తన అభిమానుల గురించి సునీత పలు విషయాలను వెల్లడించారు. ఇంతమంది అభిమానులు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి.
ఇలా నా అభిమానులు ఎక్కడికి వెళ్లినా మీ పాటంటే ఇష్టం అంటూ చాలామంది సమాధానం చెప్పారు అయితే వాళ్లు నన్ను చూసి ఇష్టపడ్డారా నా పాటను చూసి ఇష్టపడ్డారా అనే విషయం అర్థం కానిది.ఇలాగే ఓసారి ఓ కార్యక్రమానికి వెళ్లగా ఓ అభిమాని నన్ను చూసి పరుగులు పెడుతూ వచ్చారు. అప్పటికీ బౌన్సర్లు తనని అడ్డుకోగా తనని పంపించమని చెప్పాను ఆయన తన వద్దకు వచ్చి మీ పాటలంటే ఇష్టమని చెబుతాడని నేను భావించాను అయితే తను మాత్రం తన ఫోన్లో నుంచి నా ఫోటో చూపించి మీరు ఈ చీర ఎక్కడ కొన్నారు అంటూ ప్రశ్నించారు.ఈ చీర చాలా అద్భుతంగా ఉంది మా భార్యకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఎక్కడ కొన్నారు అంటూ నన్ను ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది అంటూ తన అభిమానులతో తనకు ఎదురైన సంఘటనల గురించి ఈ సందర్భంగా సునీత సమాధానం చెప్పారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…