Featured

Varun Sandhesh : వితిక నాకన్నా 6 ఏళ్ళు చిన్నది… మాకు పిల్లలు లేకపోవడానికి కారణం : వరుణ్ సందేశ్

Varun Sandhesh : తెలుగులో లవర్ బాయ్ గా మంచి హిట్స్ అందుకుని క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్. ‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ అమెరికా అబ్బాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీడిగుంట్ల శ్రీధర్ కి బంధువు. జీడిగుంట్ల వరుణ్ సందేశ్ అమెరికా నుండి వచ్చి హ్యాపీ డేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత మంచి హిట్స్ లేకపోవడం తో మళ్ళీ అమెరికా వెళ్లి ఏదైనా చేయాలనుకున్న వరుణ్, తన సినిమా ‘పడ్డానండి ప్రేమలో మరీ’ హీరోయిన్ వితిక షేరు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మాకు పిల్లలు లేకపోడానికి కారణం…

వితిక, వరుణ్ కంటే 6 సంవత్సరాలు చిన్నది అవ్వడం వల్ల తన కెరీర్ గురించి అలోచించి అప్పుడే పిల్లలు వద్దు అని ఈ కపుల్ అనుకున్నారట. ఈ విషయాన్ని వరుణ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో తెలిపారు. ఇక కోవిడ్ రావడం ఇవన్నీ కూడా కారణాలంటూ చెప్పారు. వితిక ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ చాలా మంది ఫాలోయర్స్ తో కెరీర్ లో ముందుకు వెళుతోంది. ఇక వితిక చాలా స్ట్రాంగ్ మైండెడ్ అంటూ కితాబిచ్చాడు వరుణ్. నెగెటివిటీ ని అస్సలు దగ్గరికి రానివ్వదంటూ చెప్పాడు.

అయితే బిగ్ బాస్ నుండి ఈ కపుల్ బయటికి వచ్చాక వితిక సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ ఎదుర్కొంది. కొన్ని సందర్భాల్లో చాలా బాధపడింది కామెంట్స్ వల్ల. కానీ మళ్ళీ తానే మామూలు మనిషి అయింది అంటూ వరుణ్ చెప్పాడు. ఇక వరుణ్ సినిమాల్లో అవకాశాలు తగ్గి నిరాశలో ఉన్నపుడు కూడా వితిక తనకు మళ్ళీ మంచి మోటివేషన్ ఇస్తుంది అంటూ చెప్తున్నాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago