Chiranjeevi -Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందనే విషయం మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య బహిరంగ మనస్పర్ధలు లేకపోయినా అంతర్గత మనస్పర్ధలు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే. గతంలో మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో మనకు తెలిసిందే.
మా అధ్యక్షత పదవికి మంచు విష్ణు పోటీ చేయగా మెగా ఫ్యామిలీ మద్దతుతో నటుడు ప్రకాష్ రాజు కూడా ఈ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇలా ఎన్నో విమర్శల నడుమ మా ఎన్నికల జరగడం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఏదో ఒక విషయంలో మంచు మెగా ఫ్యామిలీల మధ్య గొడవ జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మా అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చారు.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా అదే రోజు విడుదల కావడంతో ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఇలా ఇద్దరు హీరోలు దసరా బరిలో దిగుతుండగా ఊహించని విధంగా వీరికి పోటీగా మంచు విష్ణు సైతం దసరా బరిలోకి పోటీ నిలిచారు.
మంచు విష్ణు సూర్య అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నటించినటువంటి చిత్రం జిన్నా.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఒకసారిగా మెగా అభిమానులు షాక్ అయ్యారు.ఇలా ఒకేరోజు నాగార్జున చిరంజీవి విష్ణు సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందని పూర్తిగా అందరి సినిమాలపై ప్రభావం ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి మంచు విష్ణు ఊహించని విధంగా జిన్నా సినిమా విడుదల తేదీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…