Priyamani:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి మూడవ సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె పెళ్లయిన కొత్తలో, యమదొంగ, నవవసంతం వంటి పలు సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్ గా పలువురు హీరోలు సరసన నటించిన ఈమె మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ పలు వెబ్ సిరీస్ లు చేస్తూ, సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బుల్లితెర పై ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో కార్యక్రమానికి కూడా ఈమె న్యాయ నిర్ణయతగా వ్యవహరించారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలలోనూ సినిమాలు వెబ్ సిరీస్ లలో చేస్తూ ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ప్రియమణి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ప్రియమణి కెరియర్ మొదట్లో అందరిలాగే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.తాను ఏదైనా ఒక సినిమా ఎంచుకునే ముందు పూర్తిగా కథపై అవగాహన చేసుకున్న తర్వాతే సినిమాకి ఓకే చెప్తానని ఈమె తెలియజేశారు.అయితే ఓ తెలుగు సినిమా విషయంలో తాను పొరపాటు చేశానని అయితే కథ చెప్పింది ఒకటి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒకటి చేశారంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ సినిమాకి కమిట్ అయ్యానని అయితే ఈ సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఓ సన్నివేశం కోసం నిర్మాత బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని ఇబ్బంది పెట్టారంటూ ప్రియమణి వెల్లడించారు.అయితే నిర్మాత అలా చెప్పేసరికి తాను నో అని చెప్పాను కాకపోతే అప్పటికే సగం సినిమా పూర్తి అయ్యింది ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని బలవంతంగా ఇష్టం లేకపోయినా టాటూ వేయించుకోవాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా ప్రియమణి తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది గురించి వెల్లడించారు.ఇలా ఆమె తన ఇబ్బందులను తెలిపినప్పటికీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…