Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన ఈమె నాగచైతన్యతో ప్రేమలో పడి దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈమె కొన్ని మనస్పర్ధలు కారణంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు.ఇక నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడంతో సమంతదే తప్పు అన్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.సమంత వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు రావడం విడిపోవడం జరిగింది అంటూ సమంత గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
సమంత ఇలాంటి వార్తలన్నింటిని తిప్పికొడుతూ సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సమంతకు సద్గురు బాబా ఒక మంచి వరుడిని వెతికి పెట్టారని ఆయన సమక్షంలోనే సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సమంత సద్గురు బాబాను ఎంతగానో విశ్వసిస్తారు.
సమంత సద్గురు బాబా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఆయన చెప్పే ప్రవచనాలను సమంత తప్పకుండా వింటుందని ఆయన తనకు ఓ తండ్రితో సమానం అంటూ సమంత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే సమంత భవిష్యత్తు గురించి ఆలోచించిన సద్గురు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారని అందుకు సమంత కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.ఇక సమంతకు కూడా సద్గురు మాట వేదవాకు అని సమంత తప్పకుండా రెండో పెళ్లికి ఒప్పుకొనే ఉంటుందంటూ పలువురు నెటిజన్ లు ఈ విషయంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి సమంత నిజంగానే రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…