Keerthi Bhat : ఒక కెరీర్లో కష్టపడి పైకి రావాలంటే మనకు అదృష్టం తో పాటు మనవాళ్ళ తోడు ప్రోత్సాహం కూడా ఉండాలి. అయితే అవేమి లేకపోయినా సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. చిన్న కష్టానికే క్రుంగిపోయే యువతరం ఉన్న ఈ రోజుల్లో ఒకవైపు కుటుంబాన్ని మొత్తం కోల్పోయినా నెల పాటు కోమా లో ఉండి వచ్చినా తిరిగి నిలబడి తనకంటూ ఒక కెరీర్ లో స్థిరపడి ఇంకొకరికి జీవితాన్ని ఇస్తున్న కీర్తి భట్ అందరికీ ఆదర్శమే. కీర్తి జీవితంలో జరిగిన విషాదాలు ఆమెకు జీవితం అంటే ఏంటో నేర్పించాయంటూ చెప్తోంది.
ప్రేమించిన వ్యక్తి వదిలేసి వేళ్ళిపోయాడు…
బిగ్ బాస్ సీజన్ 6 కాంటెస్టంట్ గా అడుగుపెట్టిన కీర్తి జీవితం ఒక విషాదం. ఎవరికైనా జీవితంలో అనుకోని కష్టాలు కామన్ కానీ కీర్తికి కష్టాలే జీవితం అయిపోయాయి. ధర్మస్థలం వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్న, వదిన వాళ్ళ పాప అందరినీ కోల్పోయింది కీర్తి. ఇక తండ్రి మరణం తట్టుకోలేక కోమాలోకి వెళ్ళి 32 రోజులు కోమాలో ఉండి ఆ తరువాత కోలుకున్నాక బంధువులతో ఆస్తి తగాదాలు. అవన్నీ వదిలేసి బెంగళూరుకి కట్టుబట్టల్తో వస్తే తినడానికి తిండి లేకపోతే కుక్కకి వేసిన బ్రేడ్ తిన్న రోజులు ఉన్నాయంటూ కీర్తి తన గతాన్ని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న కీర్తి మళ్ళీ తన సొంత కాళ్ళపై నిలబడి సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయింది. అయితే కీర్తి జీవితంలో ప్రేమ, బ్రేక్అప్ ఈ కష్టాలు కూడా ఉన్నాయి. చిన్నతనం నుండి తెలిసిన స్నేహితుడినే ప్రేమించిన కీర్తి నాలుగేళ్ళ క్రితమే ప్రేమ అని, అది స్నేహం కాదని తెలుసుకుని ప్రేమించుకున్నారు. కానీ అంతలోనే ఆ ఆనందం కూడా కీర్తికి దూరమైంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో కీర్తి ప్రేమించిన వ్యక్తి చెప్పకుండా ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. కుటుంబ పరిస్థితుల వల్ల వెళ్లిపోతున్నట్లు చెప్పాడట. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కీర్తి ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. అయితే కీర్తి అతనితో బ్రేక్అప్ అవడం వల్ల మళ్ళీ మానసికంగా క్రుంగిపోయింది. మళ్ళీ ఒంటరిని అయిపోయానని బాధపడింది. ఇక చాలు చనిపోదాం అనే ఆలోచనలు వచ్చాయట కానీ నాకంటూ ఒక పాప, తన బాధ్యత నా మీద ఉంది అని బ్రతకాలని అనుకుందట. ఇప్పటికీ ఇండస్ట్రీ నుండి కొంతమంది దగ్గర నుండి పెళ్లి ప్రస్తావన వచ్చినా ముందు పాప గురించి చెబుతుందట కీర్తి. పాప నాతోనే ఉంటుంది అని చెప్పడంతో కొందరు అమ్మని అడిగి చెబుతా అంటే మరీ కొంతమంది పాపను ఎక్కడైన చేర్పించి మనం పెళ్లి చేసుకుందాం అనే వారట. అందుకే ఇక ఈ ప్రేమ, పెళ్లి ఇవన్నీ వద్దు మన కెరీర్, పాప అంతే చాలు అని అనుకుందట కీర్తి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…