టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తిరుమలలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన భార్యపై చేసిన ఓ ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
తాజాగా తన భార్య కావ్యతో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ, “నా పెళ్లాం నిప్పురా” అనే మాస్ క్యాప్షన్ పెట్టారు. సాధారణంగా సినిమాల్లోనే మాస్ డైలాగులు చెప్పే ఆయన, నిజ జీవితంలో కూడా అదే స్టైల్‌లో ప్రేమను వ్యక్తపరచడం అభిమానులకు నచ్చింది. ‘కావ్యమ్మ’ అంటూ పిలుస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్ వేడుక సినీ తారల సందడితో కళకళలాడింది. చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య, శ్రీకాంత్ వంటి ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఒకే వేదికపై పలువురు సినీ ప్రముఖులు కనిపించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీనివాస్, యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆయనకు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…