Naatu Naatu Song: ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకోవడాన్ని కొందరు గర్విస్తూ ఉండగా మరికొందరు తమ అసూయను వెళ్ళగకుతున్నారు. ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడంతో బాలీవుడ్ మాత్రం ఎలాంటి సంతోషం వ్యక్తం చేయకుండా ఆస్కార్ అవార్డు రావడానికి కూడా తప్పుపడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండిస్ స్నేహితుడు షాన్ ముత్తతిల్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ రావడంపై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుతూ ఇండియాలోనే అవార్డు అమ్ముతారు అనుకున్నాను.. కానీ ఆస్కార్ అవార్డులను కూడా అమ్ముతున్నారు అంతా డబ్బుతోనే జరుగుతుంది. మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా పొందవచ్చు అంటూ ఈయన కామెంట్ చేశారు.
ఇలా తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఓర్చుకోలేనటువంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా డబ్బులు ఇచ్చి కొన్నారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈయన చేసిన ఈ కామెంట్ల పై నేటిజన్స్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక తెలుగు సినిమా ఇలాంటి అవార్డు అందుకోవడంతో బాలీవుడ్ ఓర్చుకోలేక పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరికొందరు ముందు మీరు నటనను నేర్చుకొని అవార్డుల గురించి మాట్లాడండి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇలా అవార్డులను కొనుగోలు చేసే ఆనవాయితీ మీ బాలీవుడ్ సినిమాల మాదిరిగా దక్షణాది సినిమాలకు అలవాటు లేదంటూ తీవ్రస్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీ పై పలువురు సెలబ్రిటీలపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…