Featured

Nag Ashwin: ప్రాజెక్టుకే రూమర్లపై స్పందించిన నాగ్ అశ్విన్.. అన్ని కథలు ఒకేలా ఉండవంటూ కామెంట్స్!

Nag Ashwin: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని ఈ సినిమా అచ్చం శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాని పోలి ఉంటుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే రెండు ఒకే కథంశమని అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే సినిమాకు ఏ మాత్రం పోలిక లేదని టైం ట్రావెల్ కథాంశం అయినంత మాత్రాన అన్ని సినిమాలు ఒకేలా ఉండవ్ అంటూ ఈయన పరోక్షంగా మండిపడ్డారు.

Nag Ashwin: ఆ వార్తలన్నీ ఆవాస్తవమే…

ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఈయన స్పందిస్తూ ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ కామెంట్ చేశారు. ప్రాజెక్టుకే సినిమాల్లో ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయిస్తున్నాము అంటూ ఈ సినిమా గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమే అంటూ ఈ రూమర్లను ఖండించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago