Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాలలో మారుమోగుతున్నారు. ఈయన జనసేన పార్టీ తరఫున ఈసారి ఎన్నికలలో భారీ మెజారిటీ అందుకున్నారు. ఈ క్రమంలోనే 12వ తేదీ గెలిచిన కూటమి నేతలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ ప్రమాణస్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ కు అప్పగించే బాధ్యతల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మరిన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు మరో రెండు మంత్ర పదవులు కూడా తీసుకోబోతున్నారని సమాచారం. అయితే జనసేన కోసం ఇన్ని రోజులు కష్టపడిన వారికి కూడా ఏపీ క్యాబినెట్లో చోటు కల్పించే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన అన్నయ్య నాగబాబు గత పది సంవత్సరాలు కాలంగా జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ క్యాబినెట్లో తనకు చోటు కల్పించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు సమాచారం. నిజానికి అనకాపల్లి ఎంపీగా నాగబాబు ఎన్నికల బరిలో దిగాలని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ జనసేన సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు..
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నాగబాబుని నియమించి అలా తనని ఏపీ క్యాబినెట్లో మంత్రిగా తీసుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది. గత కొద్దిరోజులుగా ఈయన టిటిడి చైర్మన్ గా బాధ్యతలు అందుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలలో వాస్తవం లేదని నాగబాబు ఖండించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…