Nagachaitanya: అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. తాజాగా నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది అయితే మొదటిసారి ఈయన నటించిన ఈ వెబ్ సిరీస్ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంటుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో కూడా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన నటించిన బాలీవుడ్ మొట్టమొదటి సినిమా లాల్ సింగ్ చద్దా గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ…
లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విషయం నాకు ముందుగానే తెలిసిన కూడా నేను ఈ సినిమాలో నటించే వాడిని అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తనకు ఎంతో అద్భుతమైన అవకాశమని అందుకే ఈ సినిమాలో తప్పకుండా నటించేవాడిని అంటూ తెలియచేశారు.
జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి..
ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో కలిసి నటించడం వల్ల తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి అలాగే సినిమా అన్న తర్వాత కూడా హిట్ ఫ్లాప్ లు ఉంటాయని వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ మన పనులను మనం చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…