Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. గత దశబ్ద కాలం పైగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ కార్యక్రమానికి త్వరలోనే ముగింపు పలకపోతున్నారని తెలుస్తుంది. జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో కూడా హీరోలుగా డైరెక్టర్లుగాను కొనసాగుతున్నారు.
ఈ విధంగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ముగియబోతోంది అని తెలియడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే రేటింగ్ తగ్గిపోవడమేనని తెలుస్తుంది ఈ కార్యక్రమం మొదట్లో రోజా నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు అదేవిధంగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారు కూడా మంచి స్కిట్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరించారు ఇలా వీరందరూ ఫర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఆదరించారు కానీ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో రేటింగ్ తగ్గిపోయింది.
రేటింగ్ తగ్గడమే కారణమా…
ఇలా ఈ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో రేటింగ్ రాకపోవడంతో మల్లె మాల వారు ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ కార్యక్రమం ఆగిపోతుందనే విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆగిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…