Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తెలంగాణ ఎన్నికలలో ఫలితాలు విడుదలైన అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం గురించి ఇప్పటికే చర్చలు జరిగి అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించారు.
ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులు కావడంతో ఎంతో మంది అభిమానులు రాజకీయ నాయకులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.
నమ్మకాన్ని వమ్ము చేయకుండా…
ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది.
జూన్ నెల చివరి వారంలో బ్యాంకు సేవలను వినియోగించాలనుకునే ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం వెలువడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా…
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్…
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న కార్యాలయాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర పరిపాలన నిర్వహణలో…
ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో “మా ఇంటి బంగారం” ఒకటి. ప్రముఖ నటి సమంత ప్రధాన…
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…