యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. దసరా రోజు అంటే అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రీతు వర్మ నాని సరసన నటించిన టక్ జగదీశ్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్ జగదీశ్ తర్వాత రీతు వర్మ నటించిన సీనిమా ఇదే. ఇది కూడా దసరా నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల చేయగా.. ఓ రేంజిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. దీనికి థమన్ సంగీతం వహించగా.. శేఖర్ మాస్టార్ కోరియోగ్రాఫర్ గా వహించాడు. ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…