Nagababu: ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారందరూ ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని చివరికి ఎంతో దీన పరిస్థితులలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొందరి పరిస్థితి చూసి చాలామంది ఆర్థిక సహాయం చేస్తూ వారికి భరోసా కల్పించగా మరికొందరు మాత్రం ఎలాంటి సహాయం అందక ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇలా తెలుగు తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వాసుకి గురించి పరిచయం అవసరం లేదు అయితే తెలుగులో ఈమె పాకీజా పేరుతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఒకప్పుడు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఆర్థిక ఇబ్బందులు గురించి తెలిపారు.
తనకు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదని పూట గడవడం కూడా కష్టంగా మారిందని తాను హాస్టల్లో ఉంటున్నానని తెలిపారు. అయితే ఈమె ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు చూసి చలించి పోయిన మెగా బ్రదర్ నాగబాబు ఈమెకు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తనకు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో అవకాశం కల్పించాలని తాను కూడా ప్రయత్నం చేస్తాను అంటూ తెలియజేశారు.
ఇలా నాగబాబు తనకు ఆర్థిక సహాయం చేశారని తెలియడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగబాబు గారు తనకు ఎదురుగా ఉంటే కాళ్లకు దండం పెట్టేదాన్ని అని తెలిపారు.తమిళంలో తాను ఎన్నో సినిమాలలో చేసిన తనకు ఎవరూ కూడా ఒక ₹1000 కూడా ఆర్థిక సహాయం చేయలేదని ప్రస్తుతం తాను నాలుగు ముద్దలు తింటున్నాను అవి కేవలం తెలుగువారు, తెలుగు సినిమా పెట్టిన భోజనమేనని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…