Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన హర హర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (ఓజీ వర్కింగ్ టైటిల్ ) సినిమాను చేయబోతున్నట్లు తెలిసింది.
ఈ సినిమా జనవరి 30వ తేదీ ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసింది.ఇక ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తరువాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిసారి వైట్ అండ్ వైట్ లో కనిపించేవారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో మాత్రం ఈయన నయా లుక్ లో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ ధరించిన వాచ్ కూడా అంతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.ఈ క్రమంలోనే పవన్ ధరించిన వాచ్ బ్రాండ్ ఏది అది ఎంత ఖరీదు చేస్తుందని అభిమానులు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ పనేరాయ్ అనే కంపెనీకి చెందినదని ఈ వాచ్ ఖరీదు రూ. 13.52 లక్షలు అని సమాచారం. ఇలా పవన్ వాచ్ ధర ఇన్ని లక్షలని తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ చేయడం సర్వసాధారణమే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…