Pawan Kalyan: ఓజీ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో పవన్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా… తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

0
51

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన హర హర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (ఓజీ వర్కింగ్ టైటిల్ ) సినిమాను చేయబోతున్నట్లు తెలిసింది.

ఈ సినిమా జనవరి 30వ తేదీ ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసింది.ఇక ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తరువాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ పూజా కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిసారి వైట్ అండ్ వైట్ లో కనిపించేవారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో మాత్రం ఈయన నయా లుక్ లో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ ధరించిన వాచ్ కూడా అంతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.ఈ క్రమంలోనే పవన్ ధరించిన వాచ్ బ్రాండ్ ఏది అది ఎంత ఖరీదు చేస్తుందని అభిమానులు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.

Pawan Kalyan: పనేరాయ్ కంపెనీకి

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ పనేరాయ్ అనే కంపెనీకి చెందినదని ఈ వాచ్ ఖరీదు రూ. 13.52 లక్షలు అని సమాచారం. ఇలా పవన్ వాచ్ ధర ఇన్ని లక్షలని తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ చేయడం సర్వసాధారణమే.