Naga Chaitanya: సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి ఏ ఒక్క ఛానల్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో ఈ చిత్ర బృందం బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో సందడి చేశారు.
జీ తెలుగు బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున నాగచైతన్య హీరోయిన్ కృతి శెట్టి వేదిక పైకి వచ్చారు.ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించగా సుమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో అంత్యాక్షరీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాగార్జున టీమ్ ఒకవైపు నాగచైతన్య టీమ్ ఒకవైపు పోటీపడ్డారు. ఇలా ఈ రెండు టీమ్స్ పాటలు పాడుతూ పోటీపడుతుండగా వేదికపై నాగార్జున నటించిన మన్మధుడు చిత్రానికి సంబంధించిన ఫోటో ప్లే చేయడంతో వెంటనే నాగచైతన్య టీమ్ ఆ సినిమాకు సంబంధించిన పాట పాడారు..
ఈ సినిమాలోని వద్దురా.. సోదరా.. అంటూ సుమ పాట పాడటం ప్రారంభించగా అనంతరం నాగచైతన్య కూడా.. వారి టీమ్ తో కలిపి పాట పాడారు. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ ఎంతో సంతోషంగా పాట పాడుతున్నారు.. అదే సమయంలో షాకింగ్ గా చూస్తున్నారు నాగార్జున. ఇక వీరిద్దరూ ఏంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…