Nagachaitanya: సినీ నటుడు అక్కినేని వారసుడు నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న నాగచైతన్య నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇలా ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత వీరు నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివసిస్తూ ఉండేవారు.
ఇక వీరిద్దరికీ విడాకులు రావడంతో నాగచైతన్య ఆ ఇంటిని సమంతకే వదిలిపెట్టి తిరిగి తన తండ్రి ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి నాగచైతన్య తన స్నేహితులకు దగ్గరగా ఉండడం కోసం జూబ్లీహిల్స్ ఏరియాలో తన అభిరుచులకు అనుగుణంగా ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య ఆ ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేశారు.
అయితే తాజాగా ఈ ఇంటికి నాగచైతన్య ఎన్ని కోట్లు ఖర్చు చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా తన అభిరుచులకు అనుగుణంగా నాగచైతన్య ఈ ఇంటిని చాలా లగ్జరీగా నిర్మించారట. ఇంటి కోసం ఈయన ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.ఇలా అన్ని సదుపాయాలు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ఇంటిని నిర్మించడం కోసం నాగచైతన్య ఈ స్థాయిలో ఖర్చు పెట్టారట.
ఇలా నాగచైతన్య దగ్గర ఖరీదైన ఇల్లు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది.ఇలా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చినప్పటికీ చాలా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని చెప్పాలి. ఇక తాజాగా ఈయన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అనంతరం నాగచైతన్య కృతి శెట్టితో కలిసి వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 12న విడుదలకు సిద్ధమైంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…