Nagachaitanya -Sobhita: అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో గుర్తింపు పొందిన నటుడు నాగచైతన్య తన సినిమాల కన్నా వ్యక్తిగత విషయాల వల్ల తరచు వార్తలలో నిలుస్తున్నారు.ఈయన నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనంతరం కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండగా ఈయన గురించి ఓ క్రేజీ వార్త వైరల్ గా మారింది. నాగచైతన్య మరొక నటి శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగా వీరిద్దరూ విదేశాలలో కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
అదేవిధంగా నాగచైతన్య పోస్టుకు శోభిత లైక్ కొట్టడం వంటి సంఘటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.ఇలా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు బయటకు రావడంతో వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారంటూ పలువురు భావించారు. ఇకపోతే తాజాగా ఈ జంట గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శోభిత నాగచైతన్య ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలలో చెప్పడంతో ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా వీరి ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నప్పటికీ ఈయనకు కూడా జీవితంలో ఒక తోడు కావాలి కనుక ఆయన ఇష్ట ప్రకారమే శోభితతో పెళ్లి చేయడానికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…