Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.
ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…